నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఫిక్స్ చేశారు. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో నందమూరి తేజశ్విని కూడా భాగం అవుతుంది. అసలైతే డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలు జరగాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఐతే ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి సినిమా దాదాపు ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కమిటైన సినిమాల వల్ల తాను మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినిమా చేయలేనని చేతులెత్తేశాడని వార్తలు వచ్చాయి. దాని వల్ల సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ మోక్షజ్ఞ సినిమా ఆగిపోలేదని మేకర్స్ ప్రకటించారు. నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. సినిమా అందరు అనుకుంతున్నట్టుగా ఆగిపోలేదని. త్వరలోనే సినిమా అప్డేట్ తో వస్తామని ప్రకటించారు.
మోక్షజ్ఞ సినిమాకు మరోసారి మైథాలజీ టచ్ ఇవ్వాలని చూస్తున్నాడు ప్రశాంత్ వర్మ. సినిమాను అభిమన్యుడి నేపథ్యంతో తెరకెక్కిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఆగిపోయింది అనుకున్న ఫ్యాన్స్ కి మంచి శుభవార్త చెప్పారు. SLV సినిమాస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
తొలి సినిమా గురించి ఇలాంటి వార్తలతో పాటు మొదటి సినిమా కాకుండా మోక్షజ్ఞ రెండో సినిమా వార్తలు వచ్చాయి. వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని రాసుకొచ్చారు. ఐతే ఈ వార్తల్లో ఏది వాస్తవం అన్నది త్వరలో తెలుస్తుంది.
3