Nandamuri Mokshagna నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో లెజెండ్ టైం లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు కానీ అది కుదరలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా మోక్షజ్ఞ తెరంగేట్రం ప్లాన్ చేశారని అన్నారు అది జరగలేదు. మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం నందమూర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెబుతూ వస్తున్నారు తప్ప దానికి సంబందించిన క్లూస్ ఏమి ఇవ్వట్లేదు. అప్పుడప్పుడే మోక్షజ్ఞ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తప్ప నందమూరి ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వట్లేదు. లేటెస్ట్ గా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫ్యాన్స్ కి జోష్ వచ్చేలా చేసింది. ప్రస్తుతం ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
త్వరలోనే అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఆదిత్య 999 మాక్స్ చేయాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్, బోయపాటి ఈ ఇద్దరి దర్శకుల్లో ఒకరి చేత ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. మరి వీటిలో ఏది జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బాలయ్య తనయుడి విషయంలో భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది.