Nandamuri Mokshagna : నందమూరి అభిమానులంతా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. మొన్నటివరకు ఇప్పుడు అప్పుడు అంటూ సాగిన మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇప్పుడు ఉపందుకునట్లు తెలుస్తుంది. తన తెరంగేట్రం కోసం మోక్షజ్ఞ కూడా కసరత్తులు చేస్తూ కష్ట పడుతున్నారు. ఇటీవల మోక్షజ్ఞకి సంబంధించిన కొత్త లుక్స్ బయటకి వచ్చి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ కొత్త లుక్స్ చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
కాగా అభిమానులందరిలో మాత్రం ఒక సందేహం అలాగే మిగిలిపోయింది. మోక్షజ్ఞ ఎంట్రీ ఏ దర్శకుడుతో ఉండబోతుందో అని అందరిలో క్యూరియాసిటీ నెలకుంది. మొన్నటి వరకు చాలామంది దర్శకులు పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు గట్టిగ వినిపిస్తున్న పేరు ఏంటంటే ‘ప్రశాంత్ వర్మ’. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్టుని అందుకున్న ప్రశాంత్ వర్మకి, బాలయ్యకి మధ్య మంచి బంధమే ఏర్పడింది. దీంతో మోక్షజ్ఞ భాద్యతని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పజెప్పినట్లు తెలుస్తుంది.
హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ.. రణ్‌వీర్ సింగ్ తో సినిమా అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఖాళీగానే ఉన్నారు. మరి ప్రశాంత్ వర్మ నిజంగానే.. మోక్షజ్ఞ ఎంట్రీ భాద్యతని తీసుకుంటున్నారా లేదా చూడాలి. కాగా మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే భాద్యతని బయట నిర్మాత కాకుండా ఇంటిలోని వారే తీసుకోబోతున్నారు. మోక్షజ్ఞ సోదరి, బాలయ్య చిన్న కూతురు తేజశ్వని ఆ సినిమాని నిర్మించబోతున్నారట. మరి ఈ మూవీని ఎప్పుడు అనౌన్స్ చేసి, ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి.