Site icon HashtagU Telugu

Nandamuri Mokshagna : మోక్షజ్ఞ తెరంగేట్రం.. డైరెక్టర్ ఫిక్స్ అయినట్టేనా..?

Mokshagna

Mokshagna

Nandamuri Mokshagna నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి తప్ప అది నిజం అవ్వట్లేదు. తను తీస్తున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఉంటాడని బాలకృష్ణ చెబుతున్నా ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్నది చెప్పలేని పరిస్థితి.

ఇదిలాఉంటే మోక్షజ్ఞ ఎంట్రీపై కొత్త వార్త వైరల్ గా మారింది. నందమూరి వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని లేటేస్ట్ టాక్. బాలయ్యకు వరుస హిట్లు ఇస్తున్న బోయపాటి శ్రీను మోక్షజ్ఞ బాధ్యత కూడా మీద వేసుకున్నాడని తెలుస్తుంది.

బాలకృష్ణతో అఖండ 2 ప్లాన్ చేస్తున్న బోయపాటి ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం ఒక పాత్ర రాస్తే బాగుంటుందని.. మోక్షజ్ఞ క్యామియోతో అఖండ 2 కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని అంటున్నారు. అయితే అఖండ 2 లో అలా కుదురుతుందా లేదా అన్నది తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే ఇది ఫిక్స్ అని అంటున్నారు. అదే నిజమైతే బాలయ్య హిట్ సెంటిమెంట్ ని మోక్షజ్ఞతో కూడా కొనసాగిస్తాడంటూ బోయపాటి శ్రీను పై ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

Also Read : Kethika Sharma : నెటిజన్ ప్రపోజల్ కి కెతిక రియాక్షన్.. నోరు మూసుకుని మరీ..!

Exit mobile version