Nandamuri Heroes Hype to Tollywood: నందమూరి హీరోస్ ‘టాలీవుడ్’ సేవియర్స్!

మాస్ అంటే నందమూరి.. నందమూరి అంటే మాస్.. అందుకే మాస్ ప్రేక్షకుల్లో నందమూరి హీరోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

  • Written By:
  • Updated On - August 9, 2022 / 04:52 PM IST

మాస్ అంటే నందమూరి.. నందమూరి అంటే మాస్.. అందుకే మాస్ ప్రేక్షకుల్లో నందమూరి హీరోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్ల సినిమాలు ఏమైనా సరే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. నందమూరి హీరోలకు సరైన కథ పడాలేకానీ.. ఇక రికార్డులన్నీ బ్రేక్ కావాల్సిందే. ఒకవైపు కరోనా దెబ్బ.. మరోవైపు ఓటీటీ ప్రభావంతో టాలీవుడ్ కళ తప్పిపోయింది. ప్రేక్షకులు లేక పెద్ద పెద్ద థియేటర్స్ సైతం మూత పడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.  అలాంటి సమయంలో పెద్ద హీరోల సినిమాలు సైతం విడుదలకు భయపడిపోతుంటే.. నేనున్నా అంటూ వచ్చాడు అఖండ రూపంలో బాలయ్య. బాలయ్య రౌద్రానికి థియేటర్స్ అన్నీ షేక్ అయ్యాయి. అఖండ రూపంలో థియేటర్స్ లో పూనకాలు మొదలయ్యాయి. అత్యధిక కలెక్షన్లు సాధించాయి. ఆ తర్వాత రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఆ జోరు కోనసాగించలేకపోవడంతో థియేటర్స్ మళ్లీ కళ తప్పాయి.

మళ్లీ నేనున్నా అంటూ ముందుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ లో కొమురం భీంగా తన నటనతో మంత్రుముగ్ధుల్ని చేశాడు. రాంచరణ్ కూడా ఆకట్టుకున్నప్పటికీ ఎన్టీఆర్ కు ఎక్కవ మార్కులు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ నెలరోజుల పాటు సందడి చేయడంతో పంపిణీదారులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఆచార్య, ఎఫ్3 లాంటి సినిమాలు పెద్ద సినిమాలు ఆకట్టుకోలేని తరుణంలో నందమూరి కళ్యాణ్ రూపంలో బింబిసారుడి రూపంలో ప్రేక్షకుల ఆకలిని తీర్చేశాడు. ఒకవైపు బింబిసార, మరోవైపు సీతారామంతో థియేటర్స్ లో సందడి నెలకొంది. మొత్తానికి అఖండ (బాలయ్య), ఆర్ఆర్ఆర్ (జూనియర్ ఎన్టీఆర్), బింబిసార (కళ్యాణ్ రామ్) ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ కు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ముగ్గురి హీరోలను టాలీవుడ్ సేవియర్స్ గా అభివర్ణిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.