Site icon HashtagU Telugu

NTR : హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో నందమూరి వారసుడు.. కొత్త ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్.. హాజరయిన నందమూరి ఫ్యామిలీ..

Nandamuri Family New Hero Ntr New Movie Opening

Ntr New Movie Opening

NTR : నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే అనేకమంది హీరోలు ఉండగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కిరామ్ తనయుడు తార‌క రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇతని పేరు కూడా ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ కొత్త ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా జరిగింది.

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా, వీణారావు హీరోయిన్ గా న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై యలమంచలి గీత నిర్మాణంలో ఈ కొత్త సినిమా ప్రకటించారు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ కి సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలయ్య భార్య వసుంధర, మరికొంతమంది ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం రాలేదు.

కొత్త ఎన్టీఆర్, హీరోయిన్ వీణారావులపై చంద్రబాబు భార్య భువనేశ్వరి క్లాప్ కొట్టగా పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేసారు. మరి ఈ కొత్త ఎన్టీఆర్ తన సినిమాలతో ఎలా మెప్పిస్తాడా చూడాలి. నందమూరి అభిమానులు కొత్త ఎన్టీఆర్ కి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

Ntr Family Photo

Also Read : NTR : చిరంజీవి గారు – బాలయ్య బాబాయ్ కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..