Balakrishna : ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడం కాదు.. ఆయన దారిలో.. బాలయ్య వైరల్ కామెంట్స్..

ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడం కాదు.. ఆయన దారిలో కూడా నడవాలి. బాలయ్య వైరల్ కామెంట్స్.

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 08:38 AM IST

Balakrishna : ఇటీవల కాలంలో నందమూరి వారసుల మధ్య కొన్ని విబేధాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక సైలెన్స్ యుద్ధమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి వీరి మధ్య విబేధాలకు రాజకీయ విషయాలు కారణమా..? కుటుంబ విషయాలు కారణమా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే పలు సందర్భాల్లో వీరు చేసే కొన్ని కామెంట్స్.. ఇన్‌డైరెక్ట్ గా ఆ విబేధాలకు కనెక్ట్ అవుతున్నాయి.

ముఖ్యంగా బాలయ్య చేసే పలు కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శిస్తూ చేసినవేనా..? అనే సందేహం కలిగిస్తున్నాయి. తాజాగా బాలయ్య ఓ మూవీ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘సత్యభామ’. నిన్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ.. “నందమూరి తారక రామారావు వారసులు అని ఆయన గురించి చెప్పుకోవడం, లేదా ఆయన దారులు గురించి చెప్పుకోవడం కాదు. మనం ఆయన దారిని అనుసరిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మన సవ్యంగా నడిస్తేనే, సమాజం కూడా సవ్యంగా నడుస్తుంది” అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ కామెంట్స్ విన్న నెటిజెన్స్‌.. బాలయ్య మాటలు వెనుక ఉన్న రహస్యం జూనియర్ ఎన్టీఆర్ విభేదమే అయ్యుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా జూనియర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పొలిటికల్ గా ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం పై, ఆయన పై మాటలు దాడి, అరెస్ట్ లు జరిగినా ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వలేదు. ఈ విషయంలోనే ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వచ్చింది. ఈ విషయం కూడా నందమూరి వారసుల మధ్య విబేధాలకు ఒక కారణమైందని అభిప్రాయాలు వినబడుతుంటాయి.