Site icon HashtagU Telugu

Pawan-Balakrishna: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న బాలయ్య బాబు.. నేనున్నాను అంటూ?

Mixcollage 23 Feb 2024 08 42 Am 4572

Mixcollage 23 Feb 2024 08 42 Am 4572

టాలీవుడ్ హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాటలోనే బాలయ్య బాబు నేనున్నాను అంటూ పయనించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో నిర్మాతలకు టెన్షన్ కాస్త డబుల్ టెన్సన్ అయిపోయింది. కాగా పాలిటిక్స్ కారణంగా 4 నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు పవన్. ఇప్పుడు బాలయ్య ఇదే చేయబోతున్నారు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ప్రస్తుతం నిర్మాతలకు కూడా ఒక ఇప్పుడు క్లారిటీ ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనతో సినిమాలకు కమిటైన దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కూడా తనపై కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. పవన్ ఉన్నా లేకున్నా ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇప్పుడు బాలయ్య కూడా ఇదే దారిలో వెళ్లేలా కనిపిస్తున్నారు. ఈయన కూడా సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బాలయ్య కూడా ప్రచారం కోసం సిద్ధమవుతున్నారు.

దీనికోసం 2 నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్సైపోయారు బాలయ్య. అందుకే బాబీ సినిమా ప్రస్తుత షెడ్యూల్ అయ్యాక, కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మే నెలలోనే మళ్లీ బాలయ్య కెమెరా ముందుకు వస్తారని.. అప్పటి వరకు NBK109కి బ్రేక్ తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న నాన్ స్టాప్ షెడ్యూల్స్‌లో బాలయ్య కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మునపట్లా కాన్సట్రేట్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే దర్శక నిర్మాతలకు విషయం చెప్పి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు బాలయ్య. మరి ఈ విషయం బయట క్లారిటీ రావాలి అంటే మూవీ మేకర్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.