Mokshagna Teja : నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఙ ఎంట్రీపై..

నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. మోక్షజ్ఙ సినీ రంగప్రవేశం పనుల్లో వేగం పెంచిన బాలయ్య..

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 06:46 AM IST

Mokshagna Teja : నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం.. రేపు మాపు అంటూ వారసుడి రంగప్రవేశాని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ ఏడాదికి ఆ ఏడాది.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందంటూ చెబుతూ వస్తున్నారే తప్ప, మోక్షజ్ఞని మాత్రం లాంచ్ చేయడం లేదు. అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి ముగింపు పెట్టేలా పనులు మొదలుపెడుతున్నారట.

ఈ ఏడాదిలోనే నందమూరి మోక్షజ్ఞ మూవీ లాంచ్ ఈవెంట్ జరిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. వీలైనంత త్వరగా మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం జరిగేలా బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టారంట. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నారంట. కథ ఫైనల్ అవ్వగానే మూవీని వెంటనే లాంచ్ చేయనున్నారట. దాదాపు ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ మూవీ లాంచ్ ఈవెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా మోక్షజ్ఞ ఏ దర్శకుడు చేతులు మీదుగా లాంచ్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది. బాలయ్యకి ఇప్పటికే పలు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను చేతుల మీదుగానే మోక్షజ్ఞ ఎంట్రీ జరగనుందని గట్టిగా వినిపిస్తుంది. మరి ఫైనల్ గా బోయపాటితోనే మోక్షజ్ఞ ఎంట్రీ డిసైడ్ అవుతుందా..? లేదా మరో దర్శకుడు తెరపైకి వస్తారా..? అనేది చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ నడుస్తుండడంతో.. మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆసక్తిగా మారింది.

టాలీవుడ్ లో బాలయ్య కుమారుడిగా మోక్షజ్ఞకి.. మంచి గుర్తింపే ఉంటుంది. కానీ పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. మరి మోక్షజ్ఞ తన ఎంట్రీని ఎలా ఇస్తాడో చూడాలి.