Konda Reddy Buruju: కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా NBK107 టైటిల్ లాంచ్!

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ

Published By: HashtagU Telugu Desk
Konda Reddy Bruju

Konda Reddy Bruju

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK107 టైటిల్ లాంచ్ ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక జరుపుకుంటున్న చిత్రం #NBK107 కావడం విశేషం. అక్టోబర్ 21, సాయంత్రం 8:15 టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు.

శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

  Last Updated: 19 Oct 2022, 03:32 PM IST