టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. ఇకపోతే బాలయ్య బాబు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య బాబు కూతురు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఈ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాగా బాలకృష్ణ అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించే తదుపరి చిత్రంపై అంచనాలు తప్పకుండా పీక్స్ కి వెళతాయి. అలాంటి బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే ఊపులో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ 109వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 💥🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤩#NBK109 #NandamuriBalakrishna @dirbobby @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/tmtYX38HlY
— Sithara Entertainments (@SitharaEnts) March 7, 2024
నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా మార్చి 8న మహా శివరాత్రి కావడంతో ఎన్బీకే 109 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బాలయ్య ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే బాలయ్య మరోసారి ఊచకోత మొదలు పెట్టేలా ఉన్నాడు. గొడ్డలి పట్టుకుని వెహికల్ నుంచి దిగుతున్నట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ లో కూలెస్ట్ అండ్ క్రూయలెస్ట్ అని బాలయ్య పాత్రని అభివర్ణించారు. పోస్టరే ఇలా ఉంటే ఇక గ్లింప్స్ లో బాలయ్య శివతాండవం ఖాయం అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈసారి కూడా బాలయ్య బాబు అభిమానానికి పూనకాలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.