Site icon HashtagU Telugu

Mahesh and Namrata: మహేశ్ పై నమ్రత ముద్దుల వర్షం.. ఓల్డ్ ఫొటో వైరల్!

Mahesh Babu And Namrata

Mahesh Babu And Namrata

ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేశ్, నమ్రత (Mahesh and Namrata) నేడు 18వ వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున మహేష్ బాబు ఇన్ స్టా (Instagram)లో నమ్రతతో ఉన్న పాత ఫొటోను షేర్ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనే విషయం తెల్సిందే. ఆమె మ్యారేజ్ డే (Marriage Day) సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేసింది. చాలా సంవత్సరాల క్రితం ఫొటో అయ్యి ఉంటుంది.

మహేష్ బాబు పై పడి ముద్దుల్లో (Kiss) నమ్రత ముంచెత్తుతోంది. ఈ ఫొటో ఇద్దరి మధ్య (Mahesh and Namrata) ఉన్న బాండిండ్ మరియు ప్రేమకు ప్రతి రూపం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా మీ జంట ఉండాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో సినిమా కోసం ప్రేక్షకులు పుష్కర కాలంగా వెయిట్ చేస్తున్నారు.

ఎట్టకేలకు కాంబో (Combo) రిపీట్ అయ్యింది. ఇదే ఏడాది ఆగస్టు వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే. ప్రస్తుతం మహేశ్, నమ్రత (Mahesh and Namrata) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.

Also Read: Marriage affair: లేడీస్ బీ కేర్ ఫుల్.. పెళ్లైన వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటున్నారా?

Exit mobile version