Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. తన ఫోటోషూట్స్ తో పాటు ఫ్యామిలీ పిక్స్ అండ్ డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం డాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సితార.. మహేష్ బాబు సినిమా పాటలతో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్ కి కూడా డాన్స్ చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ఈక్రమంలోనే తాజాగా మరో డాన్స్ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక ఇంగ్లీష్ పాటకి సితార స్టైలిష్ గా డాన్స్ వేసి వావ్ అనిపిస్తుంది. టాలీవుడ్ డాన్సర్ ఫల్గుణి తో కలిసి సితార.. ఈ డాన్స్ వీడియో చేసింది. ఈ వీడియోని సితార తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన మహేష్ బాబు అభిమానులు.. సితారలోని డాన్స్ టాలెంట్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ డాన్స్ వీడియో పై సితార తల్లి నమ్రతా, హీరోయిన్ శ్రీలీల కూడా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేసారు. క్లాప్ అండ్ లవ్ ఎమోజిలతో నమ్రతా కామెంట్ చేసారు. శ్రీలీల ఏమో.. “ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు” అంటూ కామెంట్ చేసారు. కాగా గుంటూరు కారం సమయంలో శ్రీలీల, సితార మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆ స్నేహని అలానే మెయిన్‌టైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.