Megastar Tribute: భారతీయ సినీ చరిత్ర లోనే నాగేశ్వర్ రావు ఓ దిగ్గజ నటుడు: చిరంజీవి

ఇవాళ టాలీవుడ్ లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు శత జయంతి.

Published By: HashtagU Telugu Desk
1

1

ఇవాళ టాలీవుడ్ లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు శత జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకొని టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మహానటుడికి నివాళి అర్పించారు. ’’అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి  ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి  నివాళులర్పిస్తున్నా. ఆయన తెలుగు సినిమాకే  కాదు  భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు’’ అంటూ చిరంజీవి స్పందించారు.

‘‘నాగేశ్వర్ రావు నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా  బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో  ఎప్పటికీ  నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని  కుటుంబంలోని  ప్రతి ఒక్కరికి,  సోదరుడు nagarjuna కి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు,  సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అంటూ  మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నాడు.

Also Read: Jr NTR Devara: ఏపీ ఎన్నికలను టార్గెట్ చేసిన ఎన్టీఆర్ దేవర!

  Last Updated: 20 Sep 2023, 12:44 PM IST