సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్లో శ్రీ లీల , మీనాక్షి లు హీరోయిన్లు గా రామకృష్ణ , జగపతి బాబు , రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ..ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ట్రయిలర్ తో ఊర మాస్ మూవీ అని అభిమానులు భావించిన అటు మాస్ గా లేకుండా , ఇటు క్లాస్ గా లేకుండా ఉండడం తో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. నిన్నటితో ఈ మూవీ వన్ వీక్ పూర్తి చేసుకుంది. కాకపోతే సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి డిస్ట్రబ్యూటర్స్ , బయ్యర్లను సేఫ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా నిర్మాత నాగ వంశీ (Producer Naga Vamshi) సినిమా కలెక్షన్ల ఫై స్పందించారు. మహేష్ కెరీర్ లో ఇంత పెద్ద హిట్ ఇవ్వడం సంతోషంగా ఉందని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సలార్ లాంటి మాస్ మూవీకి అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ప్లస్ అయ్యిందని, కానీ త్రివిక్రమ్ తీసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఆ పద్ధతి సూట్ కాదని గుర్తించకపోవడం వల్లే సోషల్ మీడియాలో కొంత మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటె సంక్రాంతి బరిలో నాగ్ , వెంకీ , మహేష్ సినిమాలతో పాటు తేజ – వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ మూవీ బ్లక్ బస్టర్ విజయాన్ని సాధించింది. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించింది. నిన్నటి పెద్ద మొత్తంలో ఈ మూవీ కి థియేటర్స్ కేటాయించారు. మొదటి వారం మొత్తం గుంటూరు కారం చిత్రానికి థియేటర్స్ కేటాయించగా..ఇప్పుడు చాల థియేటర్స్ హనుమాన్ కు వెళ్లాయి. దీంతొ ప్రేక్షకులు ఈ మూవీ ని చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు.
Read Also : Ayodhya Rammandir : మల్టీప్లెక్సు స్క్రీన్ ఫై అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసే ఛాన్స్ ..