Site icon HashtagU Telugu

Naga Chaitanya-Sobhita’s Wedding : చైతూ-శోభిత లకు నాగార్జున పెళ్లి గిఫ్ట్ ఇదేనా..?

Nag Gift Chiru

Nag Gift Chiru

మరో మూడు రోజుల్లో నాగచైతన్య, శోభితలు ఒకటి (Naga Chaitanya-Sobhita’s Wedding) కాబోతున్నారు. ఈ నెల 04 న అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 29) ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. వధూవరులిద్దరికీ మంగళ స్నానాలు చేయించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫొటోలు సోషల్ మీడియా లో వైరలవుతున్నాయి. అదే సమయంలో కాబోయే కోడలికి అక్కినేని కుటుంబీకులు ఇవ్వబోయే కానుకలు, బహుమతుల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది

వీరి పెళ్లి సందర్భంగా వారికి నాగార్జున ఖరీదైన గిఫ్ట్ (Nagarjuna Gift) ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల నాగ్ రూ.2.10 కోట్ల విలువైన లెక్సస్ ఎలక్ట్రిక్ కారు కొన్నారు. కొడుకు, కోడలికి బహుమతి ఇచ్చేందుకే దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలను సైతం ఇవ్వనున్నట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ఇక నాగచైతన్య 2017లో సమంతని వివాహం చేసుకోగా.. మనస్పర్థల కారణంగా ఇద్దరూ 2021లో విడిపోయారు. ఆ తరువాత శోభితతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన నాగచైతన్య ఈ ఏడాది ఆగస్టులో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే.. ఈ నిశ్చితార్థానికి ముందే జంటగా విదేశాల్లో తిరుగుతూ కెమెరాలకి ఈ జంట చిక్కింది. ఇలా పలుమార్లు మీడియా కంటపడడంతో వీరి రహస్య ప్రేమ బట్టబయలు అయ్యింది.

Read Also : Electricity Charges Hike : బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ – అంబటి సెటైర్లు