Site icon HashtagU Telugu

N Convention Demolition : ఫ్యాన్స్ కు నాగార్జున రిక్వెస్ట్..

Nagarjuna N Convention

Nagarjuna N Convention

కింగ్ నాగార్జున కు సంబదించిన N కన్వెన్షన్ సెంటర్ (N Convention Demolition ) ను హైడ్రా (Hydra ) అధికారులు శనివారం కూల్చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ ను 2015లో నిర్మించారు. ఈ సెంటర్ ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని తేల్చారు. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ చెరువులు , ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ అక్రమాలపై హైడ్రా ను ఏర్పాటు చేసి..ఎక్కడిక్కడే కూల్చేవేస్తూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో నాగార్జున కు సంబదించిన N-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చడం ఫై అంత మాట్లాడుకుంటున్నారు. ఇక మీడియా సైతం రకరకాలుగా ప్రచారాలు చేస్తుండడం తో నాగార్జున ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేసారు. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ, N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను..అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

Read Also : Gachibowli Stadium : ఇంటర్‌కాంటినెంటల్ కప్‌కు సిద్ధమైన గచ్చిబౌలి స్టేడియం