Site icon HashtagU Telugu

King Nag@100: ప్రతిష్టాత్మకంగా నాగ్ వందో సినిమా.. డైరెక్టర్ ఎవరో మరి

Nagarjuna speaks about Amala Pregnancy Time in Mr Pregnant Trailer Launch Event

Nagarjuna speaks about Amala Pregnancy Time in Mr Pregnant Trailer Launch Event

King Nag@100: టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మైలురాయి ప్రాజెక్ట్ నిజంగా ప్రత్యేకమైనదిగా ఉండాలని కోరుకుంటాడు. గతంలో నాగార్జున “మనం”లో పనిచేసిన విక్రమ్ కుమార్‌కు మొదట ఓకే చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత చిరంజీవి “గాడ్ ఫాదర్” దర్శకుడు మోహన్ రాజాతో కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ, ఆ ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం, నాగార్జున తన 99వ చిత్రం “నా సామి రంగ” మూవీతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగ్ ఈ సినిమా నిర్మాణంలో తలమునకలై ఉండటంతో తన 100వ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల నవీన్ అనే తమిళ దర్శకుడు నాగార్జునకు కథను వివరించాడు. నాగ్ కు బాగా నచ్చిందట. అయితే నాగార్జున ఈ తమిళ దర్శకుడ్ని ఎంచుకోవచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని నాగార్జున సన్నిహిత వర్గాలు నొక్కి చెబుతున్నాయి.