Site icon HashtagU Telugu

Nagarjuna: 100వ సినిమా పనుల్లో నాగ్.. దర్శకుడిగా మోహన్ రాజా..?

Nagarjuna

Resizeimagesize (1280 X 720) (4) 11zon

నాగార్జున (Nagarjuna)కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ‘బంగార్రాజు’ హిట్ అయిందని చెప్పుకున్నప్పటికీ, అది నాగార్జున రేంజ్ హిట్ కాదనే కామెంట్స్ వినిపించాయి. ఆ తరువాత నాగ్ చేసిన సినిమాలు వసూళ్ల పరంగా అభిమానులను నిరాశ పరిచాయి. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. నాగార్జున తన 99వ సినిమాకి సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టేశారు. రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Also Read: Aamani: నటి ఆమని సంచలన వ్యాఖ్యలు.. డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు

ఈ సినిమాలో కథానాయికగా మృణాళ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున తన 100 సినిమాను కూడా లైన్లో పెడుతున్నారని సమాచారం. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజాను తీసుకున్నాడని అంటున్నారు. ఇటీవల చిరంజీవి చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి మోహన్ రాజానే దర్శకుడు. ఆయన టేకింగ్ నచ్చడం వలన నాగార్జున ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.