Nagarjuna : నాగార్జున వెబ్ సీరీస్ కి అడ్డు పడుతుంది ఎవరు..?

విజయ్ బిన్నితోనే నాగ్ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. నా సామిరంగ కన్నా ముందే ఆ సినిమా చేయాల్సి ఉన్నా ఈ రీమేక్ కథ చేశాక ఒరిజినల్ స్టోరీ

Published By: HashtagU Telugu Desk
King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

Nagarjuna కింగ్ నాగార్జున నా సామిరంగ (Na Samiranga) సినిమా తర్వాత ప్రస్తుతం ధనుష్ తో కుబేర సినిమా లో నటిస్తున్నాడు. సినిమాలో ఆయన పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర ను బాగా తెరకెక్కిస్తున్నారని టాక్. ఐతే నాగార్జున సోలోగా చేసే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. నా సామిరంగ టీం తోనే మరో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చినా వాటిని కన్ ఫర్మ్ చేయలేదు.

నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నితోనే నాగ్ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. నా సామిరంగ కన్నా ముందే ఆ సినిమా చేయాల్సి ఉన్నా ఈ రీమేక్ కథ చేశాక ఒరిజినల్ స్టోరీ చేద్దామని నాగార్జున చెప్పడంతో అలా చేశారు. ఐతే హిట్ పడింది కాబట్టి విజయ్ తో నాగార్జున సినిమా కన్ ఫర్మ్ అయినట్టే అని చెప్పొచ్చు.

ఐతే కొన్నాళ్లుగా నాగార్జున వెబ్ సీరీస్ (Web Series) చేయాలని చూస్తున్నారు. సరైన కథ దొరికితే డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాలని నాగార్జున ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటి అవకాశం రావట్లేదని తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్ రానా నాయుడు సీరీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.

ఐతే నాగార్జున కూడా వెబ్ సీరీస్ చేస్తే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక త్వరలో స్టార్ట్ అవబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 (BiggBoss 8) కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి చేస్తున్నారు.  అటు సినిమాలు బిగ్ బాస్ ఇప్పటివరకు బాగానే బ్యాలెన్స్ చేసిన నాగార్జున వెబ్ సీరీస్ లు కూడా చేస్తే మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెబ్ సీరీస్ లు సీజన్లు ఎన్నైనా పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Rashmika Mandanna : ఒకేరోజు రెండు సినిమాలు.. తనతో పోటీ పడుతున్న రష్మిక..!

  Last Updated: 23 Jul 2024, 11:22 PM IST