Site icon HashtagU Telugu

Nag Fans Upset: నాగార్జునకు రిక్వెస్ట్.. అలాంటి సినిమాలు చేయొద్దంటున్న ఫ్యాన్స్!

Nag

Nag

నాగార్జునకు యాక్షన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాలు చేయడం ఆయనకు చాలా ఇష్టం. కానీ అవి అతనికి విజయాన్ని అందించడం లేదు. ఇటీవల కాలంలో నాగార్జున అలాంటి మూడు సినిమాల్లో నటించాడు. ఆ మూడు దారుణంగా నిరాశపర్చాయి. ప్రేక్షకులు తిరస్కరించిన చిత్రం “దెయ్యం”. యాక్షన్ కొరియోగ్రఫీ, టేకింగ్ లో  అత్యుత్తమ యాక్షన్ డ్రామాలతో సమానంగా ఉన్నాయి. కానీ కథ అస్సలు లేదు. సినిమా సెకండాఫ్ ఏమాతం బాగాలేదు.

నాగార్జున లాంటి స్టార్ కి కలెక్షన్స్ చాలా తక్కువ. “ఆఫీసర్”, “వైల్డ్ డాగ్” “ది ఘోస్ట్” లాంటి యాక్షన్ సినిమాల్లో చూసేందుకు నాగార్జున అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సినిమాలు చేయడం మానేయాలని నాగార్జున అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నాగ్ అభిమానుల మాట వింటాడా?

Exit mobile version