Site icon HashtagU Telugu

Nagarjuna : ఫ్యాన్స్ నవ్వే నా ధైర్యం.. మళ్లీ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటున్న నాగార్జున..!

Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

Nagarjuna సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ.. అయితే సంక్రాంతికి వచ్చిన తన సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నారు కింగ్ నాగార్జున. ఈ సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగారునతో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమా లో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సినిమా సక్సెస్ తనకు ఎంతగానో కిక్ ఇచ్చిందని అన్నారు నాగార్జున. ఈ సినిమా 3 నెలల్లో రిలీజ్ అంటే నాకు పిచ్చెక్కిందేమో అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టి చూపించా. తనని చూసి అభిమానులు నవ్వుతుంటారు ఆ నవ్వుఏ తనకు ఇంత ధైర్యం ఇస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ కి తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ నాగార్జున స్పీచ్ అదరగొట్టారు.

ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అంతా బాగా హార్డ్ వర్క్ చేశారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఎంతో ప్లస్ అయ్యిందని అన్నారు నాగార్జున. సినిమా పూర్తైనందుకు బాధగా ఉంది. సినిమా షూటింగ్ అంతా ఒక ఫెస్టివల్ గా జరిగిందని అన్నారు నాగార్జున.

అంతేకాదు మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి కలుద్దామని అన్నారు. అంటే వచ్చే సంక్రాంతికి కూడా నాగార్జున సినిమాతో వస్తారని ముందే హింట్ ఇచ్చారు. నాగార్జున సంక్రాంతికి సెంటిమెంట్ ఏదో బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ కాగా అదే దారిలో ఈ సంక్రాంతికి నా సామిరంగ వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

Also Read : Guntur Kaaram : సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గుంటూరు కారం సరికొత్త రికార్డు