Nagarjuna: అనుష్క నాగచైతన్య రూమర్స్ పై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున?

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, నాగచైతన్య మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తె

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 05:40 PM IST

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, నాగచైతన్య మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి అఫైర్లు అంటూ కూడా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై హీరో నాగార్జున స్పందిస్తూ వాటిని ఖండించారు. కాగా అక్కినేని నాగార్జున గురించి మనందరికీ తెలిసిందే. వయసులో కూడా అదే ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు యంగ్ పోటీని ఇస్తున్నారు.. నాగార్జున హీరోగా, నిర్మాతగా ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చాడు. అందులో దర్శకులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు.

కుర్ర హీరోలు కూడా ఉన్నారు. అలా లైఫ్‌ ఇచ్చిన వారిలో అనుష్క కూడా ఒకరు. యోగా టీచర్‌ని పనిచేస్తున్న అనుష్కని గుర్తించి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కోరిక మేరకు సినిమాల్లోకి తీసుకొచ్చారు. వీరి కాంబోలో సూపర్‌ సినిమా వచ్చింది. సినిమా పెద్దగా ఆడలేదు, కానీ అనుష్క లాంటి లేడీ సూపర్‌ స్టార్‌ టాలీవుడ్‌కే కాదు, సౌత్‌ ఇండస్ట్రీకి దొరికింది. ఇదిలా ఉంటే అనుష్కతో నాగార్జున ఐదు సినిమాలు చేశారు. సూపర్‌,డాన్‌,రగడ,ఢమరుకం, ఓం నమో వెంకటేశాయా చిత్రాల్లో కలిసి నటించారు. కింగ్‌ కేడీ సినిమాలలో స్పెషల్‌ సాంగ్స్ చేసింది. ఊపిరి లో కూడా గెస్ట్ గా మెరిసింది. ఇలా ఎనిమిది సినిమాలతో భాగమయ్యారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది.

తనకు సినిమా లైఫ్‌ ఇచ్చిన హీరో కావడంతో నాగ్‌తో చేసేందుకు అనుష్క ఎప్పుడూ నో చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొన్ని రూమర్లు వచ్చాయి. సహజంగా ఎక్కువ సినిమాలు కలిసి చేస్తే ఇలాంటి రూమర్లు వస్తుంటాయి. నాగార్జున అనుష్క మధ్య ఏదో ఉందనే గాసిప్పులు వచ్చాయి. కొన్నాళ్లకి ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత నాగ్‌ తనయుడు హీరో నాగ చైతన్యతో రూమర్లు వచ్చాయి. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ఇవి సంచలనంగా మారాయి. నాగార్జుననే ఈ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరిగింది. దాన్ని నాగ్‌ వెంటనే ఖండించారు. తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో దీనిపై నాగార్జున స్పందించారు. ఈ గాసిప్‌లపై ఆయన రియాక్ట్ అవుతూ, ఇలాంటి రూమర్లు రావడం దారుణం. నాతో, ఇప్పుడు చైతూతో ఇలాంటివి అల్లేయడం చాలా విచారకరం అన్నారు. సోసైటీ ఎలా దిగజారిపోతుందో అనడానికి ఇదే నిదర్శనం అని నాగ్‌ కొట్టిపారేశాడు.