Site icon HashtagU Telugu

Nagarjuna : అమల కడుపుతో ఉన్నప్పుడు ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను.. ఎమోషనల్ అయిన నాగార్జున..

Nagarjuna speaks about Amala Pregnancy Time in Mr Pregnant Trailer Launch Event

Nagarjuna speaks about Amala Pregnancy Time in Mr Pregnant Trailer Launch Event

బిగ్‌బాస్‌(BiggBoss)తో గుర్తింపు తెచ్చుకున్న సోహైల్(Sohail), రూపా(Roopa) కొడవయూర్ జంటగా కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైక్ మూవీస్ బ్యానర్ పై మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక అబ్బాయికి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుంది అనే కామెడీ, ఎమోషనల్ కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మిస్టర్ ప్రగ్నెంట్(Mr Pregnant) సినిమా ఆగస్టు 18న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కింగ్ నాగార్జున(Nagarjuna) ముఖ్య అతిథిగా వచ్చారు. సోహైల్ బిగ్‌బాస్ తో నాగార్జునకు దగ్గరయ్యాడు. దీంతో సోహైల్ పిలవగానే నాగార్జున ఈ ఈవెంట్ కి వచ్చారు.

ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. మాతృతం అనేది ఓ అద్భుతమైన వరం. అమల కడుపుతో ఉన్నప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు ఇప్పటికి గుర్తు ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూశాక నాకు ఆ సంఘటనలే గుర్తుకు వస్తున్నాయి. నేను హలో బ్రదర్ సినిమా షూట్ లో ఉన్నప్పుడు అమలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ సినిమా షూట్ పూర్తయ్యాక అమల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు నేను ఏ సినిమా చేయలేదు. డెలివరీ అయ్యేదాకా షూటింగ్స్ కి వెళ్లకుండా అమలకు తోడుగా ఉన్నాను. డెలివరీ టైములో కూడా అమల పక్కనే చెయ్యి పట్టుకొని ఉన్నాను. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయటం అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ సినిమా నాగురించి మాట్లాడుతూ.. మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాలో మగవాళ్ళు ప్రగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అని ఆసక్తిగా చూపించారు. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఇంకా పెరిగింది అని అన్నారు నాగార్జున.