Site icon HashtagU Telugu

Nagarjuna : ధనుష్ కుబేరలో నాగార్జున రోల్ అదేనా..?

King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

Nagarjuna కింగ్ నాగార్జున నా సామిరంగ తర్వాత తన సోలో సినిమా గురించి పక్కన పెట్టి ఇతర హీరోల సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర సినిమాలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. కుబేర ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచిన శేఖర్ కమ్ముల ధనుష్ లుక్ తో ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర ముందు బిలీనియర్ అని వార్తలు రాగా లేటెస్ట్ గా సినిమాలో కింగ్ నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో నాగార్జున ఖాలీ డ్రెస్ వేసుకుని రఫ్ఫాడించేస్తారట. ధనుష్ కుబేర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

కుబేర సినిమా తెలుగు, తమిళంతో పాటుగా హిందీలో కూడా భారీ రిలీజ్ చేయనున్నారు. ఆసియన్ సునీల్ నిర్మిస్తున్న ఈ సినిమా తో మరోసారి ధనుష్ తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలాఉంటే రజిని కూలీ సినిమాలో కూడా నాగార్జున నటిస్తారన్న టాక్ ఉంది. నా సామిరంగ తర్వాత నాగార్జున నెక్స్ట్ సోలో సినిమా తమిళ దర్శకుడు నవీన్ డైరెక్షన్ లో చేస్తాడని టాక్. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : Star Hero Invest 6 Crores : స్టార్ హీరోయిన్ తో ప్రేమ.. 2 నెలల్లో 6 కోట్లు ఖర్చు చేసిన స్టార్..!