Site icon HashtagU Telugu

Nagarjuna : నాగార్జున ‘శిరిడిసాయి’ ప్రాజెక్ట్ ఎలా మొదలైందో తెలుసా..?

Nagarjuna Raghavendra Rao Shiridi Sai Movie Project Backend Story how it Started

Nagarjuna Raghavendra Rao Shiridi Sai Movie Project Backend Story how it Started

టాలీవుడ్(Tollywood) మన్మథుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు వేసుకున్న నాగార్జున(Nagarjuna) నుంచి మాస్, క్లాస్ సినిమాలు మాత్రమే కాదు భక్తిరస చిత్రాలు కూడా వచ్చాయి. ఈక్రమంలోనే అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి, ఓం నమో వెంకటేశాయ.. వంటి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఇక ఈ చిత్రాలు అన్నిటిని కూడా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు(Raghavendra Rao) డైరెక్ట్ చేశారు.

అయితే అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో నాగార్జున భక్తుడిగా కనిపిస్తే.. శిరిడిసాయి(Shirdi Sai) సినిమాలో మాత్రం సాయిబాబా పాత్రలో కనిపించాడు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలయింది అంటే.. నాగార్జున, రాఘవేంద్రరావు ఒకరోజు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో దర్శకేంద్రుడికి ఒక ఆలోచన వచ్చిందట. ‘ఇంటింటా అన్నమయ్య’ అనే ఒక సోషియో ఫాంటసీ మూవీ చేద్దామని నాగార్జునకి చెప్పారట.

కానీ నాగ్ కి ఆ ఆలోచన అంతగా నచ్చలేదు. పైగా టైటిల్ లో అన్నమయ్య అని ఉండడంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయని భావించి నాగార్జున, రాఘవేంద్రరావుతో.. “మీరు శిరిడిసాయి భక్తులు కదా. అలా ఏమైనా ఒక కథ ఆలోచించండి” అని చెప్పాడట. ఇక ఆ టాపిక్ అక్కడితో అది ముగిసిపోయింది. అయితే ఆ తరువాత కొన్ని రోజులకు ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటున్న నాగార్జునకు సడన్ గా శిరిడి వెళ్లాలని అనిపించిందట.

దీంతో వెంటనే నాగార్జున శిరిడి వెళ్లి సాయిబాబాని దర్శించుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఈ విషయాలు ఏమి రాఘవేంద్రరావుకి తెలియదు. కానీ నాగ్ ఇంటికి వచ్చే సమయానికి దర్శకేంద్రుడు శిరిడిసాయి కథతో వచ్చి.. మీరే సాయిబాబాగా నటించబోతున్నారు అని చెప్పారట. దీంతో ఇదంతా దేవుడి ఆజ్ఞ అనుకోని ఆ సినిమాలో సాయిబాబాగా నటించి మెప్పించాడు. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.

 

Also Read : Prabhas : వాయిదాల ప్రభాస్.. బాహుబలి నుంచి ప్రతి సినిమా వాయిదా పడాల్సిందే..