Site icon HashtagU Telugu

Nagarjuna : నాగార్జున మరో మల్టీస్టారర్ ప్లానింగ్..కుబేర తర్వాత ప్లాన్ అదుర్స్..!

Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky

Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky

కింగ్ నాగార్జున (Nagarjuna) నా సామిరంగ సూపర్ హిట్ తర్వాత తన సినిమాల ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కుబేర సినిమాలో నటిస్తున్న నాగార్జున. ఈ సినిమా తర్వాత మరో మల్టీస్టారర్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. అదికూడా మరో తమిళ హీరోతో నాగార్జున స్క్రీన్ పంచుకుంటారని టాక్. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చిన నాగార్జున త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో మరోసారి నాగార్జున మరో తమిళ హీరోతో కలిసి నటించబోతున్నారట. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ధనుష్ తో కలిసి కుబేర సినిమా చేస్తున్న నాగార్జున మళ్లీ మల్టీస్టారర్ చేస్తుండటం అక్కినేని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. నాగార్జున నెక్స్ట్ సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది చూడాలి.

నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్ని కూడా నాగార్జునతో మరో సినిమా చేయాలని చూస్తున్నాడట. అదే కాస్టింగ్ తో మరో సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. ఆల్రెడీ నాగార్జున మంచు విష్ణు, నాని, కార్తిలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ధనుష్ తో కుబేర చేస్తున్నాడు. మరి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందో చూడాలి.

Also Read : Prithviraj: ఆ పాత్ర కోసం బరువు పెరిగిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్