EXCLUSIVE: నాగార్జున ఔట్, బాలకృష్ణ ఇన్.. ‘బిగ్ బాస్ సీజన్ 7’ కు బాలయ్య హోస్ట్!

బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇక నుంచి బాలయ్య బాబు హోస్ట్ గా రంగంలోకి దిగనున్నాడు.

Published By: HashtagU Telugu Desk
exclusive Biggboss

Biggboss

తెలుగు రియాల్టీ షోస్ (Bigg Boss) లో తిరుగులేని ఎంటర్ టైనర్ ఏదైనా ఉందంటే ‘బిగ్ బాస్’ గురించే మొదట చెప్పుకోవాలి. హౌస్ లోపల జరిగే బాగోతాలు, ప్రేమలు, స్నేహాలు, టాస్క్ లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అందుకే బిగ్ బాస్ (Bigg Boss) కు ఫుల్ ఫాలోయింగ్. బిగ్ బాస్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో, షో ను ముందుకు తీసుకెళ్లే హోస్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, నాగార్జున (Nagarjuna) బిస్ బాస్ షోస్ ను విజయవంతం నడిపారు. అందులో కింగ్ నాగార్జున తనదైన స్టయిల్ బిగ్ బాస్ (Bigg Boss) ను ముందుకు తీసుకెళ్లాడు.

లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. నాగార్జున (Nagarjuna) షో నుండి నిష్క్రమించారని, తదుపరి సీజన్ బిగ్ బాస్ 7ని నందమూరి బాలకృష్ణ (Nanadamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. నాగార్జున షో నుండి నిష్క్రమించడం గురించి అధికారిక సమాచారం లేదు. బిగ్ బాస్ ప్రతి సీజన్‌కు దాదాపు 4-5 నెలల కీలకమైన సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇందు వల్ల సినిమాలపై ఫోకస్ చేయడం వీలుకాకపోవచ్చు. అందుకే నాగ్ బిగ్ బాస్ నుంచి తప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

అయితే “నాగార్జున (Nag) నిష్క్రమణ ఇంకా అధికారికం కాదు.  కానీ నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు 7 హోస్ట్‌గా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రియాలిటీ షోలను హోస్ట్ చేసిన అనుభవం ఉన్నందున మేకర్స్ బాలయ్యతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. NBK ప్రస్తుతం ఆహాలో ‘NBK సీజన్ 2తో అన్‌స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షోను నిర్వహిన్నాడు. ఈ షో హిట్ కావడంతో పాటు మంచి రెస్పాన్స్ కూడా వస్తుండగా, న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రభాస్, నటుడు గోపీచంద్ పాల్గొననున్నారు.

Also Read: Mega Cousins: జిల్‌.. జిల్‌.. జిగా.. ఒకే ఫ్రేమ్ లో ‘మెగా, అల్లు’ ఫ్యామిలీ!

  Last Updated: 21 Dec 2022, 01:44 PM IST