Site icon HashtagU Telugu

Nagarjuna New Movie Title : నాగార్జున కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ ..?

Nag New Movie Title

Nag New Movie Title

అక్కినేని (Akkineni) ఫ్యామిలీ కి ఏమాత్రం కలిసిరావడం లేదు. నాగార్జున (Nagarjuna ) , నాగ చైతన్య , అఖిల్ ఇలా ముగ్గురు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ హిట్లు మాత్రం ఎవరికీ పడడం లేదు. ఈ తరుణంలో అభిమానులంతా ఒక్క హిట్ పడితే బాగుండని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్‌ పూర్తి కాబోతుంది. ఇదిలా ఉంటే నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. జ్ఞానవేళ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి Love Action Romance టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రేజీ చిత్రంలో నాగ్‌ పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టూడియో గ్రీన్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట. మొత్తానికి కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సర్‌ప్రైజ్‌ గెటప్స్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడని తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది.

Read Also : Revanth Reddy Govt : జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్