Site icon HashtagU Telugu

Nagarjuna : నాగార్జున నా సామిరంగ రిలీజ్ డేట్ లాక్..!

Nagarjuna Na Samiranga Release Date Lock

Nagarjuna Na Samiranga Release Date Lock

కింగ్ నాగార్జున (Nagarjuna) సంక్రాంతికి తను నటించిన నా సామిరంగ రిలీజ్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నాగార్జున మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమా లో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించగా రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో వదిలారు మేకర్స్.

నా సామిరంగ అంటూ మాస్ బీట్ తో వచ్చిన ఈ ప్రోమో అక్కినేని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. నాగార్జున చాలా రోజుల తర్వాత మాస్ అటెంప్ట్ చేస్తుండగా నా సామిరంగ మీద భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

Also Read : Bigg Boss OTT 2 : బిగ్ బాస్ OTT 2.. వాళ్ల ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారా..?

ఇక ఈ సినిమా పొంగల్ రిలీజ్ అన్నారు తప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఫైనల్ గా నాగార్జున నా సామిరంగ సినిమా జనవరి 14న రిలీజ్ డేట్ లాక్ చేశారు. సంక్రాంతికి స్టార్ సినిమాల హంగామా ఉండగా మహేష్, వెంకటేష్, రవితేజలకు తానేమి తగ్గనని పొంగల్ ఫైట్ కి సిద్ధమవుతున్నాడు నాగార్జున.

We’re now on WhatsApp : Click to Join

పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా వస్తున్న నా సామిరంగ మీద నమ్మకంతో ఉన్నారు నాగార్జున. సంక్రాంతికి వచ్చిన తన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వడంతో నా సామిరంగ సినిమాను కావాలని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు నాగార్జున. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. వారిద్దరితో నాగార్జున సీన్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది.