Na Samiranga Hit Combination Repeate : హిట్టు పడ్డాక నాగార్జున అంత తేలిగ్గా వదులుతాడా.. నా సామిరంగ కాంబో మరో మూవీ ఫిక్స్..!

Na Samiranga Hit Combination Repeate కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా విషయంలో నాగార్జున బలమైన నమ్మకమే సినిమా

Published By: HashtagU Telugu Desk
Nagarjuna Na Samiranga Combo

Nagarjuna Na Samiranga Combo

Na Samiranga Hit Combination Repeate కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా విషయంలో నాగార్జున బలమైన నమ్మకమే సినిమా విజయానికి కారణమైంది. సినిమాను కేవలం 3 నెలల్లో పూర్తి చేసి వారెవా అనిపించాడు నాగార్జున. అంతేకాదు ఈ సినిమాతో దర్శకుడిగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని పరిచయం చేసి మరోసారి సూపర్ అనిపించుకున్నాడు నాగార్జున. సంక్రాంతికి వచ్చి ఇంత పెద్ద టఫ్ ఫైట్ లో సక్సెస్ సాధించాడు.

We’re now on WhatsApp : Click to Join

నా సామిరంగ సక్సెస్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్న నాగార్జున సీమా కాంబోని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్నితో మరో సినిమా చేసేందుకు రంగ సిద్ధం చేసుకుంటున్నాడు నాగార్జున. ఐతే ఈ సినిమా నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంటుందని తెలుస్తుంది.

అంతకుముందు విజయ్ బిన్ని సొంత కథతో నాగార్జున దగ్గరకు రాగా మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ కథ చేతిలో పెట్టి రీమేక్ కథ రెడీ చేయమని చెప్పాడు. అదే నా సామిరంగ అయ్యింది. అయితే ఇచ్చిన కథను చక్కగా తీశాడని ఈసారి అతని సొంత కథతో సినిమా చేస్తున్నారట. విజయ్ బిన్ని డైరెక్షన్ లో నాగార్జున మరో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో కూడా మాక్సిమం ఆషిక రంగనాథ్ నే హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయట. నా సామిరంగతో ఆ హీరోయిన్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. కన్నడ నుంచి మరో అందాల భామ టాలీవుడ్ లో పాగా వేయడానికి వచ్చిందని అందరు అనుకుంటున్నారు.

Also Read : Rakul Preet Singh Wedding: రకుల్‌ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్ర‌ధాని మోదీ కార‌ణ‌మా..?

  Last Updated: 03 Feb 2024, 07:51 AM IST