Site icon HashtagU Telugu

Nagarjuna Multistarrer : నాగార్జున 100వ సినిమా భారీ మల్టీస్టారర్ ప్లానింగ్.. నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే స్టార్ ఎవరంటే..?

King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

King Nagarjuna Crazy Role in Rajinikanth Coolie movie

Nagarjuna Multistarrer కింగ్ నాగార్జున నా సామిరంగ హిట్ తో కెరీర్ లో నూతన ఉత్సాహంతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత నాగ్ సినిమా యునానిమస్ హిట్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే నాగార్జున ఈ హిట్ తో సూపర్ జోష్ తో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున ఒకటి రెండు ప్రాజెక్ట్ ల మీద చర్చలు జరుపుతున్నారట. అందులో ఒక మల్టీస్టారర్ కూడా ఉందని టాక్.

We’re now on WhatsApp : Click to Join

నాగార్జునకు లేటెస్ట్ గా తమిళ దర్శకుడు నవీన్ ఒక కథ వినిపించారట. కథ నచ్చిన నాగ్ సినిమా దాదాపు కన్ ఫర్మ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా మల్టీస్టారర్ కథ కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటిస్తారని అంటున్నారు. నాగార్జునతో పాటు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు.

నాగార్జున అక్షయ్ కుమార్ భారీ మల్టీస్టారర్ గా సినిమా వస్తుంది. ఈ సినిమా మరో భారీ పాన్ ఇండియా సినిమా అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను నాగార్జున 100వ సినిమాగా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదే కాకుండా రాజమౌళి మహేష్ కాంబో సినిమాలో కూడా నాగ్ నటిస్తాడని అంటున్నారు.

నాగార్జున ఆల్రెడీ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించారు. సో బాలీవుడ్ లో కూడా నాగార్జునకు మంచి క్రేజ్ ఉంది. తప్పకుండా అక్షయ్ తో కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Poonam Kaur : పూనం కౌర్ కు ఆ వ్యాధి.. రెండేళ్లుగా నిద్రలేదు.. అందుకే అలా చేయాల్సి వస్తుంది..!