టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడకూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడే విధంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని జడ్జి స్పష్టం చేశారు.
గతంలో కూడా పలువురు ప్రముఖులు తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్‌లు అనుమతి లేకుండా తమ పేరు, ఫోటో వాడకూడదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కోర్టు వారికీ అనుకూలంగా తీర్పు ఇస్తూ, అనధికార వాడకాన్ని కఠినంగా నిషేధించింది. అదే విధంగా నాగార్జున కేసులోనూ కోర్టు ఆయన పిటిషన్‌ను సీరియస్‌గా పరిగణించింది.
Brain Eating AMoeba: కేరళలో బ్రెయిన్ తినే అమీబా కలకలం
సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు అనధికారంగా వాడుకోవడం ఎక్కువైంది. దాంతో వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరగడంతో పాటు, తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతున్నదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు రావడం ద్వారా నాగార్జున వ్యక్తిత్వ హక్కులు రక్షించబడటమే కాకుండా, భవిష్యత్తులో ఇతర నటులు, ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు న్యాయ పరిరక్షణ పొందే అవకాశం ఉంటుంది.