Naa Saami Ranga: నా సామి రంగ.. నాగార్జున మాస్ జాతర షురూ!

కింగ్ నాగ్ ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక టైటిల్ కూడా అదిరిపొయేలా ఉంది.

  • Written By:
  • Updated On - August 29, 2023 / 11:59 AM IST

నాగార్జున పుట్టినరోజు సందర్భంగాన తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటో ప్రకటించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయబోతున్నట్లు అధికారికంగా తెలిసింది. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన విజయ్‌ నాగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం మాస్ జాతరగా రూపొందించబడుతుంది. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

ఆస్కార్, జాతీయ అవార్డు గ్రహీత స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి నా సామి రంగ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. కీరవాణి నాగార్జున అనేక సినిమాలకు పనిచేశారు. చాలా సినిమాలు మ్యూజికల్ హిట్ కూడా.  సామి రంగ చిత్రాన్ని 2024లో సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున చాలా కాలం తర్వాత గెడ్డం లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయాలతో ఉన్న బీడీ తాగుతూ ఎంట్రీ ఇస్తాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ నేతృత్వంలోని రౌడీ బ్యాచ్‌పై దాడి చేయడం చూడొచ్చు.

ఫ్రేమ్‌లు, యాక్షన్ కొరియోగ్రఫీ, BGM అదిరిపోయేలా ఉంది. మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో నాగ్ కనిపించడం విశేషం. వచ్చే సంక్రాంతి సీజన్‌కి పలు భారీ సినిమాలు రానున్న సంగతి తెలిసిందే. అయితే, నాగార్జున తన సినిమాలను బిగ్గెస్ట్ మూవీ సీజన్ కోసం విడుదల చేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోడు. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాను పండుగకు తీసుకొస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు రాశారు. నిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.