Site icon HashtagU Telugu

Nagarjuna – Pakistan : పాకిస్తాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి.. ఏం చేస్తున్నాడో తెలుసా ?

Nagarjuna Pakistan

Nagarjuna Pakistan

Nagarjuna – Pakistan : పాకిస్తాన్‌లో నాగార్జున !! ఔను.. పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి  అచ్చం నాగార్జున లుక్‌లో కనిపిస్తున్నాడు. అతగాడి పేరు జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్. షికారీ 2019లో టిక్ టాక్ వీడియోలు చేస్తుండేవాడు.   ఆ టైంలో తను ఇండియన్ యాక్టర్ నాగార్జునలాగా ఉన్నాడంటూ ఎక్కువగా కామెంట్స్ చేస్తుండేవారు. దీంతో అసలు నాగార్జున ఎవరు అని పూర్తిగా వివరాలను షికారీ సేకరించాడు. తన లుక్స్ కాస్త మార్చి మేకప్ వేసి నాగార్జున(Nagarjuna – Pakistan) స్టైల్‌ను కాపీ కొట్టి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ , యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అలా ఫేమస్ అయ్యి ఇప్పుడు ప్రతినెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. టిక్ టాక్ వీడియోలతో మొదలయిన షికారీ మాస్ ప్రయాణం.. ప్రస్తుతం ఫుడ్ రివ్యూ వీడియోల దాకా చేరింది. షికారీ మాస్ ఇప్పుడు ఫుడ్ బ్లాగర్‌ అవతారమెత్తాడు. వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఫేమస్ ఫుడ్స్‌ను ట్రై చేస్తూ అవి ఎలా ఉన్నాయో తన ఫాలోవర్స్‌కు రివ్యూ ఇస్తుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు వెయ్యి మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నా.. యూట్యూబ్‌లో మాత్రం 20 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో తన సంపాదన కచ్చితంగా లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

నెల సంపాదన ఎంతంటే..?

నాగార్జున లాగా ఉండడం తనకు కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు షికారీ మాస్. తను ఆదాయం కోసం ఫుడ్ వీడియోలపైనే ఆధారపడతానని, వాటితోనే నెలకు రూ. 5 లక్షల దాకా వస్తున్నాయని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా సాగిపోతోందని తెలిపాడు. ఇప్పటికే ఇలా హీరోహీరోయిన్ల పోలికలు ఉన్న పలువురు సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోతున్నారు. బాలీవుడ్‌ హీరోహీరోయిన్లను పోలిన మనుషులు.. ఏకంగా సినిమాల్లోకి కూడా వచ్చేస్తున్నారు.

Also Read :Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్‌ లేని వర్సిటీలు ఇవే!