Site icon HashtagU Telugu

Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున సీరియస్

Nag Surekha

Nag Surekha

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై నాగార్జున (Nagarjuna ) స్పందించారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.

అంతకు ముందు సురేఖ ఏమన్నదంటే…

నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కొండా సురేఖ చెప్పిందట్లో ఎంత నిజం ఉంది..? ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఓ కన్వెన్షన్ కోసం నాగార్జున ఇంత దిగజారుతారా..? కొడుకు భార్య ను మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తాడా..? ఇదేమైనా సినిమానా..? ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ ఎలా చేసింది..? ఓ హోదా లో ఉన్న ఆమె..మరో మహిళా ఫై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి..? హీరోయిన్లు అంటే కేవలం అలాంటి పనులకేనా..? అని అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకం పోగొట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై నాగార్జున సీరియస్ కావడం తో ఇది ఇక్కడితో చల్లారుతుందని అంత భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

 

 

Read Also :  Mamitha Baiju : ఏకంగా విజయ్ సినిమాలో ఛాన్స్.. ప్రేమలు బ్యూటీ లక్కు మాములుగా లేదుగా..

Exit mobile version