Site icon HashtagU Telugu

Nagarjuna : అభిమానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నాగార్జున‌..

Nag Sorry

Nag Sorry

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna ) వివాదాలకు చాల దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన సినిమాలు , తన బిజినెస్ లు తప్ప మరో జోలికి వెళ్ళాడు. అప్పుడప్పుడు ఇతర సినిమా ఫంక్షన్ లకు హాజరవుతారు అంతే. అలాంటి నాగార్జున తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

ప్రస్తుతం నాగార్జున..ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘కుబేర’ (Kubera) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్ లో జరుగుతుంది. హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ధనుష్, నాగార్జున లు నడుస్తూ వస్తుండగా.. నాగార్జునను చూసిన‌ అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి ఎంతో ఆత్రుత‌తో నాగ్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. నాగార్జునకు మరింత దగ్గరికి రావడంతో పక్కనే ఉన్న బాడిగార్డ్‌ ఆయనను పక్కకు నెట్టారు. దీంతో ఆయన అదుపు తప్పి కింద పడపోయాడు. ఇంతలో త‌మాయించుకుని నిలబడ్డారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ సంఘటన నాగార్జున దృష్టికి వెళ్లడం తో..రియాక్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఎక్స్‌వేదిక‌గా ఆ వృద్ధ అభిమానికి నాగార్జున క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ ఫై కూడా నాగ్ ట్వీట్ చేసాడు. “ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించావ్ నాగీ (నాగ్ అశ్విన్). మహత్తరమైన మన భారతీయ కథలను వెండితెర పైకి తీసుకువస్తుండడం సంతోషం కలిగిస్తోంది. రిలీజ్ ట్రైలర్ చూసి అచ్చెరువొందాను. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్నాను. అమితాబ్ బచ్చన్ ఇరగదీశారు… కమల్ హాసన్ అదరగొట్టేశారు. ప్రభాస్… ప్రయోగాలు చేసేందుకు నువ్వు ఏమాత్రం వెనుకాడవు… నీలో ఆ గుణాన్ని నేను అభిమానిస్తాను. ఇక నా ఫేవరెట్ ప్రొడ్యూసర్లు అశ్వినీదత్, స్వప్న, స్వీటీలకు ఆల్ ది బెస్ట్. మీ సత్తా నిరూపించుకున్నారు. చిత్ర బృందానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Read Also : Parliament Session 2024: ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, షా, గడ్కరీ