Site icon HashtagU Telugu

Kubera : ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ప్రోమో రిలీజ్..

Nagarjuna First Look Promo Released From Dhanush Kubera Movie

Nagarjuna First Look Promo Released From Dhanush Kubera Movie

Kubera : టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. తాజాగా నేడు నాగార్జున ఫస్ట్ లుక్ ప్రోమోని కూడా రిలీజ్ చేసారు. ధనుష్ ని ఒక బిచ్చగాడిలా చూపించిన శేఖర్ కమ్ముల.. నాగార్జునని మాత్రం కొంచెం రిచ్ లుక్ లో చూపించారు.

ఇక ప్రోమో విషయానికి వస్తే.. చూడడానికి ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక పెద్ద ట్రక్ నిండా నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. వాటిలో నుంచి ఒక నోటు కింద పడితే.. నాగార్జున తన జేబులో ఉన్న నోటుని తీసి ఆ ట్రక్ అమౌంట్ లో యాడ్ చేయడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ప్రోమోకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. మరి ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

కాగా ఇన్నాళ్లు ప్రేమ కథలను తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల మొదటిసారి తన కంఫర్ట్ జోన్ దాటి వచ్చి యాక్షన్ డ్రామాతో కుబేరని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ మాఫియా డాన్ నేపథ్యంతో ఉండబోతుందని సమాచారం. ముంబైలో బిచ్చగాడైన ధనుష్ డాన్ గా ఎదగడం, తన కథలోకి గవర్నమెంట్ ఆఫీసర్ అయిన నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుందని నెట్టింట ఒక కథ వినిపిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా ధనుష్ ఇటీవలే సార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు. మరి ఇప్పుడు ఈ చిత్రంతో కూడా హిట్ అందుకుంటారా లేదా చూడాలి.