Nagarjuna : టీడీపీ, వైసీపీ పార్టీలపై నాగార్జున కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్నవి నిజమేనా..?

జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. టీడీపీ వాళ్ళు నన్ను కూడా వాళ్ళ తరుపున మాట్లాడమని ఒత్తిడి చేసారు. నాగార్జున కామెంట్స్ నిజమేనా..?

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 10:34 AM IST

Nagarjuna : అక్కినేని నాగార్జున ఎటువంటి కాంట్రవర్సీల్లో లేకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ హీరోలా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంటారు. ఏపీ రాజకీయాలకు కూడా పూర్తి దూరంగా ఉంటూ వస్తున్న కొందరు టాలీవుడ్ నటీనటులు.. ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో దిగి సందడి చేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు.

ఈక్రమంలోనే నాగార్జున కూడా రీసెంట్ గా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారంటూ కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముందుగా వైసీపీని సపోర్ట్ చేస్తున్న నాగార్జున కామెంట్స్ బయటకి వచ్చాయి. “హైదరాబాద్ లో ఉండే సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడడం సరికాదు. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. అందుకే పరిశ్రమ వాళ్ళు ఎవరూ జగన్ గారిని విమర్శించేందుకు ముందుకు రావడం లేదు. టీడీపీ వాళ్ళు నన్ను కూడా వాళ్ళ తరుపున మాట్లాడమని ఒత్తిడి చేసారు. కానీ నేను చేయలేదు” అంటూ వ్యాఖ్యానించినట్లు కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కామెంట్స్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. అసలు నిజంగానే నాగార్జున ఈ కామెంట్స్ చేసారా లేదా అని పలువురు అరా తీస్తున్నారు. ఈ విషయం నాగార్జున టీం వరకు చేరడంతో.. ఈ విషయం పై రియాక్ట్ అవుతూ నిజం ఏంటో తెలియజేసారు. ఆ కామెంట్స్ లో ఎటువంటి నిజం లేదని, నాగార్జున అసలు ఏపీ రాజకీయాలు గురించి మాట్లాడలేదని, కాబట్టి ఇటువంటి తప్పుడు వార్తలని నమ్మొద్దని చెప్పుకొచ్చారు. ఇక ఈ క్లారిటీతో నెట్టింట వైరల్ అవుతున్న కామెంట్స్ లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.