Site icon HashtagU Telugu

Nagarjuna is Meeting Samantha!: సమంతను కలుసుకోనున్న నాగార్జున!

Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు అరుదైన వ్యాధి ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఆసుపత్రి లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో సమంత త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, తమన్నా, కాజల్, అఖిల్ అక్కినేని తదితరులు సపోర్ట్ గా నిలిచారు. అయితే సామ్ హెల్త్ కండీషన్ పై నాగార్జున, నాగచైతన్య స్పందించకపోవడంతో నెటిజన్లు తమ నిరాశను వ్యక్తం చేశారు.

ఇప్పుడు నాగార్జున చెన్నైలో సమంతను వ్యక్తిగతంగా కలుసుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై నాగ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా దర్శకేందుడు రాఘవేంద్ర రావు, సమంత అనారోగ్యం గురించి రియాక్ట్ అవుతూ ట్వీట్ పెట్టారు. అనారోగ్యం నుంచి సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మునుపటి కంటే ఎంతో వేగంగా, ఆరోగ్యకరంగా సమంత వెనుదిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొంటూ.. రీసెంట్ గా తన హెల్త్ ఇష్యూ గురించి వివరంగా చెబుతూ సమంత పెట్టిన ట్వీట్ ని పంచుకున్నారు రాఘవేంద్ర రావు.