Tabu-Nag Dating: టబుతో డేటింగ్ రూమర్స్.. కింగ్ నాగార్జున రియాక్షన్ ఇదే

నాగార్జున, టబు అత్యంత ఇష్టపడే ఆన్-స్క్రీన్ జంటలలో ఒకరిగా పరిగణించబడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Nag And Tabu

Nag And Tabu

సినిమాలే కాదు. తమకు ఇష్టమైన హిట్ పెయిర్స్ (Hit Pairs) ను సిల్వర్ స్క్రీన్స్ పై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. టాలీవుడ్ (Tollywood) లో హిట్ పెయిర్ అనగానే రష్మిక, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, సమంత లాంటి జంటలు కళ్ల ముందు కదలాడుతాయి. అయితే అప్పట్లో బెస్ట్ హిట్ పెయిర్ అనగానే అక్కినేని నాగార్జున, టబు జంట (Couple) కళ్ల ముందు కదలాడుతుంది. ఈ జంట నిన్నే పెళ్లాడుతా సినిమాలో జంట నటించి మెప్పించారు. అంతేకాదు.. అద్భుతమైన కెమిస్ట్రీతో (Chemistry) నటించి ఫిదా చేశారు. బెస్ట్ టాలీవుడ్ పెయిర్ అని అనిపించుకున్నారు కూడా. అయితే వీరిద్దరూ దశాబ్ద కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం.

నాగ్ (Nagarjuna Akkineni) అమలను పెళ్లి చేసుకున్నప్పటికీ, తన సహనటి, సన్నిహితురాలు టబుతో డేటింగ్ (Dating) చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి. ఆ రోజుల్లో, ఇద్దరూ తమ సంబంధం గురించి పెదవి విప్పకుండా ఉండిపోయారు. అయితే 2017లో ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ టబు తో ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టాడు. “అవును, టబు నాకు అద్భుతమైన స్నేహితురాలు. మా స్నేహం 22 సంవత్సరాలుగా కొనసాగుతోంది. 16 సంవత్సరాల వయస్సులో టబు నాకు పరిచయమైంది. మా స్నేహం గురించి, ఏది చెప్పినా తక్కువే. ఆమె గురించి నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరు చెప్పగానే, నా ముఖం వెలిగిపోతుంది.. (నవ్వుతూ). ఆమె నా లవ్ లీ ఫ్రెండ్.

2007లో, కరణ్ జోహార్ చాట్ షో, కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో, నాగార్జునతో తన డేటింగ్ పుకార్ల (Rumours) గురించి టబు తెరిచింది. ‘తన జీవితంలో అత్యంత సన్నిహిత వ్యక్తులలో నాగ్ ఒకరు’ అని చెప్పింది. అతనితో నా సంబంధం నాకు చాలా ప్రియమైనది అని రివీల్ చేసింది. నాగార్జున, టబు అత్యంత ఇష్టపడే ఆన్-స్క్రీన్ జంటలలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఇద్దరు నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అలరించారు. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ దర్శకత్వంలో 1993లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆ సంవత్సరం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.

Also Read: Pushpa2 Item Song: పుష్ప2 ఐటెం సాంగ్ లో నటించే హాట్ బ్యూటీ ఎవరో తెలుసా!

  Last Updated: 09 May 2023, 04:40 PM IST