Naga Chaitanya – Sobhita : హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభిత ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ జంట వైరల్ అవుతూనే ఉంది. పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో చైతు, శోభిత ఘనంగా జరుపుకున్నారు.
Sobhita
శోభిత ఆల్రెడీ నిన్నే భోగి మంటలు, ముగ్గుల ఫోటోలు, పిండి వంటల ఫొటోలతో పాటు తను అందంగా రెడీ అయి తీసుకున్న సెల్ఫీ, తనవి చైతూవి కాళ్ళు మాత్రమే కనపడేలా ఫోటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి సంక్రాంతి బాగా జరుపుకుంటున్నట్టు తెలిపింది. తాజాగా నేడు నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చైతు, శోభిత ఇద్దరూ కలిసి ట్రెడిషినల్ దుస్తుల్లో ఉన్న ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫోటో చూస్తుంటే అప్పుడే పూజ చేసి వచ్చి ఫోటో దిగినట్టు ఉన్నారు.
దీంతో నాగచైతన్య, శోభిత ల ఫస్ట్ సంక్రాంతి ఫోటో వైరల్ గా మారింది. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Sobhita
Also Read : Emergency: కంగనా రనౌత్‌కి షాక్.. ఆ దేశంలో ఎమర్జెన్సీ మూవీ బ్యాన్!