Nagababu – Allu Arjun : ఈసారి ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరగనంత ఉత్కంఠగా జరిగాయి. అందుకు ఒక కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ ఎన్నికలో భాగం అవ్వడం. పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ దాదాపు టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. కొందరు ట్వీట్స్ చేస్తూ మద్దుతు తెలియజేస్తే.. మరికొందరు నేరుగా ఫీల్డ్ లోకి దిగి ప్రచారాలు చేసారు. ఈక్రమంలోనే మెగా హీరోలు కూడా మద్దతు తెలుపుతూ ప్రచారం చేసారు.
చిరంజీవి వీడియో మెసేజ్స్ తో జనసేనకి మద్దతు తెలిపితే.. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేసి మద్దతు తెలిపారు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్.. పవన్ కి మద్దుతు తెలుపుతూ ఒక చిన్న ట్వీట్ వేశారు. దానికి మెగా ఫ్యాన్స్, జనసైనికులు సంబరపడేలోపే.. అల్లు అర్జున్ చేసిన పని అందరికి కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ ఎవరి మీద అయితే ఫైట్ చేస్తున్నారో.. ఆ పార్టీ (వైసీపీ) నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి మద్దతు తెలిపారు.
సొంత కుటుంబసభ్యుడు పవన్ కళ్యాణ్ కి ఒక చిన్న ట్వీట్ తో మద్దుతు తెలిపి.. స్నేహితుడైన వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇంటికి వెళ్లి మరి మద్దతు తెలపడం అనేది మెగా అభిమానులకు, జనసైనికులకు కోపం తెప్పించింది. అయితే అల్లు అర్జున్ దీనిని సమర్ధించుకుంటూ.. “తాను ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదని, తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని, అది పవన్ బాబాయ్ అయినా, తన స్నేహితుడు రవి అయినా” అంటూ చెప్పుకొచ్చారు.
అయితే దీని పై మెగా మరియు అల్లు కుటుంబసభ్యులు ఎవరు స్పందించలేదు. తాజాగా నాగబాబు ఒక ట్వీట్ వేశారు. అది చూస్తుంటే అల్లు అర్జునే అన్నట్లు ఉందంటూ నెటిజెన్స్ భావిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరి మైండ్ లోకి అల్లు అర్జునే స్ట్రైక్ అవుతున్నారు. దీంతో కామెంట్ సెక్షన్ లో ఈ ట్వీట్ అల్లు అర్జున్‌కేనా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
allu arjun aa ?
— Chaitu (@ChaituforYSJ) May 13, 2024