Site icon HashtagU Telugu

Nagababu : జానీ మాస్టర్ ఇష్యూ పై నాగబాబు , మంచు మనోజ్ ల రియాక్షన్

Nagababu Jani

Nagababu Jani

Nagababu Reaction on Jani Master Issue : టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లో జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది. తనను గంత కొంతలంగా లైంగికంగా జానీ వేధిస్తున్నాడని..అతడి భార్య సైతం అతడికి సపోర్ట్ చేసిందని..మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేయడం తో దీనిపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ లో ఇలాంటివి చాల జరుగుతున్నాయని..కాకపోతే బయటకు రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం నడుస్తుండగా..ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ తో మరింత వైరల్ గా మారింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన భార్య ఆయెషా ను సైతం విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ ఇష్యూ పై సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. కొంతమంది జానీ ని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని కోరుతుండగా..మరికొంతమంది కఠిన శిక్షలు విధించాలని అంటున్నారు. ఇంకొందరైతే తప్పు చేశాడా..? లేదా అనేది చూడాలి అంటున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు , మంచు మనోజ్ , ఎమ్మెల్యే రాజాసింగ్ లు స్పందించారు.

జానీ మాస్టర్ ను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని బీజేపీ MLA రాజాసింగ్  (MLA Rajasingh)డిమాండ్ చేశారు. ఈ కొరియోగ్రాఫర్ ఎంత మందిని వేధించారో నిజానిజాలు బయటపెట్టాలని వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సినీ ఇండస్ట్రీకి మచ్చ తీసుకొస్తాయని మండిపడ్డారు. వీటి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాలని కోరారు. ఇలా మత మార్పిడులకు బలవంతం చేసే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు.

జనసేన నేత నాగబాబు (Nagbabu) : చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్ ను పోస్ట్ చేశారు. మీరు వినేదే నమ్మొద్దని, ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు.

మంచు మనోజ్ (Manchu Manoj) : ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని మనోజ్ సూచించారు.

అంతకు ముందు అనసూయ (Anasuya) : “అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రతిఘటించాలి. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్మందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని భావిస్తున్నాను” అని అభిప్రాయపడింది.

పూనమ్ (Poonam) : ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు.

అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi) .. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు.