Nagababu Emotional Tweet : నాగబాబు ఎమోషనల్ పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా..

”మా మధ్య ఎన్ని విభేదాలు.. వాదనలు వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మేము చేసే పనులు, మా జ్ఞాపకాలు, మా మధ్య విభేదాలు అన్నిటికంటే కూడా మా అనుబంధమే ఎంతో ముఖ్యమైనది"

Published By: HashtagU Telugu Desk
Nagababu Twet

Nagababu Twet

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ చేసి అభిమానులను ఫిదా చేసారు. రెండు రోజుల క్రితం మెగా బ్రదర్ తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ప్రాణంగా ప్రేమించిన లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి వివాహం (Varun Tej Wedding) బంధం లో అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుక ఇటలీ లో అట్టహాసంగా జరిగింది. మెగా , అల్లు కుటుంబ సభ్యుల (Mega , Allu Family)తో పాటు పలువురు సినీ స్టార్స్ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ (Nagababu Emotional Tweet) చేసారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అన్నదమ్ములతో ఉన్న ఫోటోని షేర్ చేసుకున్నాను నాగబాబు..”మా మధ్య ఎన్ని విభేదాలు.. వాదనలు వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మేము చేసే పనులు, మా జ్ఞాపకాలు, మా మధ్య విభేదాలు అన్నిటికంటే కూడా మా అనుబంధమే ఎంతో ముఖ్యమైనది.”అని పోస్ట్ చేశారు. అంతేకాదు వాళ్ళ బంధం ఎన్నో పనులు, ప్రేమతో గడిపిన క్షణాల పై ఆధారపడి ఉంటుందట. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ బంధం నిజంగా ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నట్లు నాగబాబు తెలిపారు. అలాగే తమ అనుబంధం ఎప్పటికీ విడిపోదని.. తమ బంధం పై తమకు అంత నమ్మకం ఉందని నాగబాబు పేర్కొన్నారు.

నాగబాబు చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు..మెగా బ్రదర్స్ మధ్య బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఉన్నంత అన్యోన్యతతో రేపటి తరం మెగా వారసులు కూడా ఉండాలి అని ఆశిస్తున్నారు.

Read Also : Bharateeyudu 2 : భారతీయుడు 2 వచ్చేశాడు.. ఇంట్రో టీజర్ తోనే అదరగొట్టేశారు..!

  Last Updated: 03 Nov 2023, 07:31 PM IST