Site icon HashtagU Telugu

Nagababu : మెగా బ్రదర్‌కి టీటీడీ ఛైర్మెన్‌ పదవి..? ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన నాగబాబు..

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో అండగా ఉంటూ వస్తున్నారు. తనకంటూ ఏమి ఆశించకుండా కేవలం తమ్ముడు కోసం పని చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే కూటమి ఏర్పాటు చేయడం కోసం, తన తమ్ముడు కోసం.. సీటుని కూడా త్యాగం చేసారు. తనకి సీటు ఇవ్వకపోయినా పవన్ కోసం.. ఈ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు. తాను మాత్రమే కాదు, తన భార్య పద్మజని, కొడుకు వరుణ్ తేజ్ కి కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించారు. పవన్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో పద్మజ ఎంతో కష్టపడ్డారు.

ఇక తమ్ముడు కోసం ఇంత చేసిన నాగబాబుకి పవన్ కళ్యాణ్ ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారని, అందుకోసం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా ఒప్పించారని టాక్ వినిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఛైర్మెన్ గా నాగబాబుని నియమించాలని పవన్ భావిస్తున్నారట. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు నాగబాబు వరకు చేరాయి. దీంతో ఆయన రియాక్ట్ అవుతూ ఓ ట్వీట్ చేసారు.

“ఏదైనా సమాచారం ఉంటే జనసేన పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి లేదా నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి నేనే తెలియజేశాను. అంతవరకు ఎటువంటి రూమర్స్, తప్పుడు వార్తలను నమ్మొద్దు” అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ తో నాగబాబుకి టీటీడీ ఛైర్మెన్‌ పదవి ఇస్తున్నారు అన్నది ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. మరి రానున్న రోజుల్లో నాగబాబుకి పవన్ ఎటువంటి పదవిని అప్పజెప్పుతారో చూడాలి.