Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన ఎక్స్ (X) అకౌంట్ ని డీ యాక్టీవ్ చేసేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అంతకుముందు నాగబాబు చేసిన ఓ ట్వీట్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ని చాలామంది అల్లు అర్జున్ కి ఆపాదిస్తూ కామెంట్స్ చేసారు.
ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్.. వైసీపీలో ఉన్న తన స్నేహితుడు కోసం నంద్యాల పర్యటన చేయడం వలనే నాగబాబు ఈ ట్వీట్ చేసారని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దాని పై నాగబాబు సమాధానం ఏంటో తెలుసుకోవడం కోసం.. ఎక్స్‌లో ప్రతి ఒక్కరు నాగబాబుని ప్రశ్నిస్తూ వచ్చారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టంలేకో, ఏమో తెలియదు గాని.. నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ని డీ యాక్టీవ్ చేసేసారు.
నాగబాబు సమాధానం చెప్పకుండా ఇలా డీ యాక్టీవ్ చేయడంతో.. ఆ విషయం మరింత చర్చినీయాంశంగా మారింది. న్యూస్ ఛానల్స్ లో సైతం డిబేట్స్ నడిపించారు. అయితే తాజాగా నాగబాబు.. తన ఎక్స్ అకౌంట్ ని యాక్టీవ్ చేసి మళ్ళీ తిరిగొచ్చారు. రావడంతోనే మరో వైరల్ ట్వీట్ చేసారు. “నేను నా ట్వీట్ ని డిలీట్ చేశాను” అంటూ పేర్కొన్నారు. గతంలో చేసిన ఆ వైరల్ ని ట్వీట్ ని నాగబాబు డిలీట్ చేసారు.
“I have deleted my tweet”
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024
ఇక ఈ కొత్త ట్వీట్ తో మరోసారి ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ తన నంద్యాల పర్యటన పై ఇచ్చిన వివరణ ఏంటంటే.. “రవిచంద్ర కిషోర్ రెడ్డి నాకు ఎప్పటినుంచో మిత్రుడు. తనకి మద్దుతు తెలుపుతూ పర్యటన చేస్తానని గతంలో నేను మాటిచ్చాను. నేను ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, నా అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని, అది పవన్ బాబాయ్ అయినా, నా స్నేహితుడు రవి అయినా” అంటూ చెప్పుకొచ్చారు.