టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప 2 లాంటి మూవీతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ నటించబోయే తదుపరి సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలో నటిస్తాడ అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై వస్తున్న రూమర్ లకి క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత వంశీ మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఒక భారీ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ తో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్ లో బన్నీ అట్లీతో ఒక సినిమా చేస్తారనే టాక్ కూడా ఈ మధ్య వచ్చింది. అయితే తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్,త్రివిక్రమ్ సినిమాపై ఒక అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.. బన్నీ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఈ నెలలో అంటున్నారు.
నిజమేనా అని ఒక రిపోర్టర్ అడిగగా.. దీనికి ఇప్పుడే స్టార్ట్ కాదు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొదలవుతుంది అంటూ నాగవంశీ బదులిచ్చారు. అయితే ఈ సినిమా గురించి ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో చాలా గొప్పగా మట్లాడారు నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ. అసలు ఇప్పటివరకూ ఇండియన్ సినీ చరిత్రలోనే రాని ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుందంటూ నాగవంశీ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కోసం అల్లు అరవింద్ ఇన్వెస్టర్లను వెతుకుతున్నారంటూ బన్నీ వాసు హైప్ పెంచేశారు. అందులోనూ మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో గురూజీ ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ aవ్వడంతో పాటు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోపై మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.