అల్లు అర్జున్ – త్రివిక్రమ్ (Allu Arjun – Trivikram) కలయికలో నాల్గో మూవీ సెట్స్పైకి రాబోతుంది. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి , ఆలా వైకుంఠపురం లో మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో..ఇప్పుడు మరోసారి జత కలవబోతుంది. ఈ విషయాన్నీ నిర్మాత నాగవంశీ (Producer Nagavamshi) తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాలను షేర్ చేశారు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పేలా, సినిమా పట్ల ఆసక్తి పెంచేలా నాగవంశీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ సినిమా ప్రాజెక్టు ప్రకటన కోసం జనవరిలో ఒక ప్రత్యేకమైన ప్రోమోను విడుదల చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. ఇది అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుందని, ప్రస్తుతానికి సినిమా కథ దాదాపుగా పూర్తయిందని, స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కూడా జరుగుతోందని చెప్పుకొచ్చారు.
మార్చి నెలలో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని నిర్మాత వెల్లడించారు. ప్రస్తుతం తన ఇతర కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తున్న బన్నీ, ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో భారీ విజయాలను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ గతంలో ఎవ్వరూ ప్రయత్నించని జోనర్‌లో ఉంటుందని నాగవంశీ అన్నారు. త్రివిక్రమ్ తన సృజనాత్మకతను మరో స్థాయికి తీసుకెళ్తూ, బన్నీ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన పాత్రను అందించబోతున్నారని తెలిపారు. ఇది వారి బ్యానర్‌కు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా మారుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కురిపిస్తూ..సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది.
Read Also : YSRCP With Mamata : మమతా బెనర్జీకి వైఎస్సార్ సీపీ జై.. ‘ఇండియా’ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటూ..