నందమూరి బాలకృష్ణ – జూ ఎన్టీఆర్ (Balakrishna Vs NTR) ల మధ్య గత కొద్దీ రోజులుగా మాటలు లేవు. ఇది అందరికి తెలిసిందే. త్వరలోనే వీరు కలుసుకుంటారని..అన్ని సమస్యలు సర్దుమణుగుతాయని, అంత మంచే జరుగుతుందని ఇరు అభిమానులు భావిస్తున్న వేళ..ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చి అభిమానుల్లో ఆందోళన పెంచేస్తుంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ (Unstoppable with NBK) తాజా ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం జై లవకుశ (Jai Lavakusha) ప్రస్తావన లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. బాబీ (Director Baby) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రస్తావించకుండా మిగతా సినిమాలను చూపించడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అయితే, జై లవకుశ ప్రస్తావన ఎడిట్ చేశారంటూ వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచాయి. దాంతో, సోషల్ మీడియాలో ఇది విపరీతంగా చక్కర్లు కొట్టడం మొదలైంది.
Game Changer : వాళ్లు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎందుకు ఆపాలనుకున్నారు..!
దీనిపై నిర్మాత నాగవంశీ (Producer Nagavamshi) క్లారిటీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో బాబీతో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. అయితే నాగవంశీ స్పందిస్తూ, ఎపిసోడ్‌లో జై లవకుశ గురించి అసలు ప్రస్తావనే రాలేదని, దాన్ని ఎడిట్ చేశారనేది అవాస్తవమని తేల్చేశారు. అయితే ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ గురించి చిన్న మాట మాత్రమే వచ్చినట్టు నాగవంశీ వెల్లడించారు. ఎన్టీఆర్ ఒక సినిమాలో ఒక పాత్ర పోషించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడిన మాటను నొక్కి చెప్పారు. నాగవంశీ చెప్పిన క్లారిటీ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కూల్ అవుతున్నారు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ ‘డాకు మహారాజ్ ‘ మూవీ చేసాడు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య..ఈ మూవీ తో మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా గా ఉన్నారు. మేకర్స్ సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాకు మరింత బజ్ తీసుకొస్తున్నారు.